పెయింట్స్ దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : రుక్కన్నపల్లి తాండాకు చెందిన యువకుడు సచిన్ ఖిల్లా గణపురం మండలం సోలిపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న పెయింట్స్ మరియు హార్డ్వేర్ దుకాణాన్ని సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు స్వయం ఉపాధి పై ప్రత్యేక దృష్టి సారిస్తూనే, ప్రభుత్వ ఉద్యోగ సాధనలోనూ పట్టు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పెయింట్స్ మరియు హార్డ్వేర్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్న సచిన్ ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ఖిల్లా ఘనపురం మాజీ జెడ్పిటిసిసోలిపురం రవీందర్ రెడ్డి, ముందటి తండా మాజీ సర్పంచ్ జయంతి, భాషా నాయక్, గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : పెయింట్స్ దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే)