గీతమ్స్ లో ఘనంగా ఫేర్ వెల్ డే వేడుకలు
విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి ప్రభుత్వ చీఫ్ విప్. జీవి
న్యూస్ తెలుగు/ వినుకొండ : పట్టణంలో సిద్ధార్థ నగర్ లోని గీతమ్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఫేర్ వెల్ డే వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి. ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. ముందుగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. అనంతరం 2023-24 సంవత్సరంలో 10 వ తరగతి లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన మరియు నలుగురు మెడికల్, ముగ్గురు ఐ.ఐ.టి, ఎన్.ఐ.టి లలో సీట్లు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దుశ్యాలవాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ. విద్యార్థినీ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని ఆ లక్ష్య సాధనను చేరుకునేందుకు శ్రద్ధగా చదివి విజయాన్ని అందుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం చీఫ్ విప్ జీవి మరియు మక్కెన లను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రూల్లా, పివి. సురేష్, పఠాన్ అయ్యుబ్ ఖాన్, డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : గీతమ్స్ లో ఘనంగా ఫేర్ వెల్ డే వేడుకలు)