ప్రజలలో భక్తిప్రభత్తులు పెరగడం శుభపరిణామం
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాతబజార్ 3వ వార్డ్ నందు శ్రీసీతరామలక్ష్మణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి ధ్వజస్థంభం, విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్వామిని దర్శించుకుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పున నిర్మాణం అద్భుతంగా జరిగిందని ఇందుకు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. రోడ్ల విస్తరణ తర్వాత నూతనంగా రూపుదిద్దుకున్న ఆలయాలు,దర్గాలు,మసీదులు అద్భుతంగా ఉన్నాయని కృషి చేసిన నిరంజన్ రెడ్డి అభినందనీయులు అని అన్నారు. ఆలయం నిర్మించడంతో పాటు రోజు ధూపదీప నైవేద్యాలతో నిత్యం స్వామి వారిని పూజించాలని ఇందుక నా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు సాదరంగా రావుల చంద్రశేఖరరెడ్డి ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన బొడ్రాయి శిలాకు పూజలు నిర్వహించారు. రావుల చంద్రశేఖరరెడ్డి వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,బండారు.కృష్ణ,డాక్టర్. డ్యానియాల్,సూర్యవంశపు
గిరి,సునీల్ వాల్మీకి,ఇమ్రాన్,మునికుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గోనూరు.వెంకటయ్య,వసంత శ్రీనివాసులు, నీల స్వామి,బాలస్వామి తదితరులు ఉన్నారు . (Story : ప్రజలలో భక్తిప్రభత్తులు పెరగడం శుభపరిణామం)