శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మండలం విఠంరాజు పల్లి అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురువుల దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో ఆదివారం సాయి బృందావనం చిన్న షిరిడి వద్ద గురూజీ మాట్లాడుతూ. ఈ మహోత్సవం సర్వలోక కళ్యాణార్థమై రైతులు, వ్యాపారులు, కార్మికులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి పచ్చదనంతో పులకించాలని చేస్తున్న 36వ మహాశివరాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము ఈ నెల 26వ తారీకు నాడు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగును, పూజా కార్యక్రమాలు ఉదయం 7:30 నిమిషాల నుండి గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం పార్వతి పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు విశేషమైన ద్రవ్యములతో అభిషేకాలు, విశేష అలంకరణ పూజా కార్యక్రమాలు జరుగును, అలానే 9:30 నిమిషాలకు గణపతి హోమం, ఆవాహిత మండపారాధన హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం. అనంతరం 12 :30 నిమిషాలకు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగును. 4: 30 నిమిషాలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఊరేగింపుగా సారే సమర్పణ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి దంపతులు మహిళ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి ఆశ్రమ ట్రస్ట్ అధ్యక్షులు పెండ్యాల. వెంకట మోహన్ రావు, కనిగండ్ల. అనంత కోటేశ్వరరావు, పెండ్యాల. కాశి, కొప్పురావూరి. సుధాకర్, పెండ్యాల .పుల్లారావు, మునిరెడ్డి. తదితరులు పాల్గొన్నారు. (Story : శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు)