వివాహ శుభకార్యాలకు హాజరైన రావుల చంద్రశేఖర్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ పార్లమెంట్ సభ్యులు,వనపర్తి మాజీ శాసనసభ్యులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో పలు వివాహ శుభ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం హైదరాబాదులోని ఫిలింనగర్ లో గల JRC కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సుచరిత గార్ల కుమారుడు, ప్రుద్విష్ రెడ్డి, శ్లోక దంపతుల వివాహము ఘనంగా జరిగింది. మరియు హైదరాబాదులోని BMR సర్త కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో సంకిరెడ్డి భాగ్యలక్ష్మి, సంకిరెడ్డి భీమ్ రెడ్డి దంపతుల కుమారుడు సాయి యతిన్ రెడ్డి, మేధ శ్రీ రెడ్డి వివాహ వేడుకలకు రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుల తో పాటు దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు యల్.రమణ గారు , కానయపల్లి మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ తదితరులు పాల్గొన్నారు. (Story : వివాహ శుభకార్యాలకు హాజరైన రావుల చంద్రశేఖర్ రెడ్డి)