స్నేహితుడి కూతురు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే దంపతులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : చిరకాల మిత్రుడు కొత్తకోట మండల కేంద్రానికి చెందిన చీర్ల శేఖర్ కూతురు వివాహానికి ఆదివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, శారదా రెడ్డి దంపతులిద్దరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కళ్యాణ సాయి గార్డెన్స్ లో నిర్వహించిన వివాహ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే దంపతులు శేఖర్ కుటుంబ సభ్యులతో వివాహ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఫోటోలు దిగుతూ కాసేపు దంపతులకు ఇద్దరు సందడి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గారికి చిన్ననాటి మిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : స్నేహితుడి కూతురు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే దంపతులు)