బిజెపి ఆధ్వర్యంలో బడ్జెట్ పై చర్చ
న్యూస్ తెలుగు /వినుకొండ : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025 – 26 బడ్జెట్ గురించి అందులో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన కేటాయింపు ల గురించి వివరించడానికి బడ్జెట్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి 2025 – 26 బడ్జెట్ ప్రజారాజరంజకంగా రూపొందించటం జరిగిందని వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు, మధ్యతరగతి వారికి అనుకూలంగా సామాన్యులకు, సంపన్నులకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి. జయప్రకాష్ అన్నారు. కారంపూడి రోడ్డు లోని ఒక ప్రైవేటు హోటల్ లో జరిగిన బడ్జెట్ పై చర్చ కార్యక్రమంలో పాల్గొని వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పల్నాడులోని 34 మండలాల నుంచి కార్యకర్తలు, మండల అధ్యక్షులు , మేధావులు ,నియోజకవర్గ ఇన్చార్జి యార్లగడ్డ లెనిన్ కుమార్, జిల్లా కార్యదర్శిలు, ప్రధాన కార్యదర్శిలు, జిల్లా ఉపాధ్యక్షులు , వినుకొండ పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్, శావల్యాపురం మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు, జనసేన నాయకులు నాగ శ్రీను, అడ్వకేట్లు, ఆడిటర్లు, డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, నియోజకవర్గం లోని 5 మండలాల నుండి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : బిజెపి ఆధ్వర్యంలో బడ్జెట్ పై చర్చ )