శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారికి ఘనంగా లక్ష బిల్వార్చన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం వేదమాత బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎనిమిదవ వార్షిక లక్షబిల్వార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నగర సంకీర్తన తదుపరి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన, సువాసినీలచేత లక్ష కుంకుమార్చన, శ్రీ వఠెం వేణు శర్మ చే శ్రీ చక్ర అర్చననిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణ బంధువులందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సంఘ అధ్యక్షులు పాలపర్తి సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన్నవారు. సంఘ గౌరవ సభ్యులు చంగవల్లి రామచంద్ర బాబు, నారాయణం రామ్మోహన్ ఆచార్యులు, మెరుసుపల్లి రాఘవ శర్మ, పోతుకుచ్చి శ్రీనివాస శాస్త్రి, వేలమూరు శేష సాయి శర్మ, వెలమకన్ని చంద్రశేఖర శర్మ, ప్రతాపగిరి విష్ణుశర్మ, వేలమూరి సాయి శర్మ, యనమండ్ర సాయిరామ శర్మ, జొన్నభట్ల రాంబాబు, త్రిపురారిభట్ల సాయి పవన్ శర్మ, వేలమూరి శ్రీరామ శర్మ, యనమండ్ర అజయ్ శర్మ, శిష్ట్లా విజయ్ కుమార్ శర్మ పాల్గొన్నారు.(Story : శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారికి ఘనంగా లక్ష బిల్వార్చన )