ఆరోగ్య భీమా అమలపరచడాన్ని స్వాగతించిన
ఆరోగ్య మిత్ర
న్యూస్ తెలుగు / వినుకొండ : కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ఆరోగ్య భీమాని ఏప్రిల్, మే , నెల నుండి అమలు పరచాలని పేపర్లో ప్రకటించిన విధంగా పేదలకు ఇన్సూరెన్స్ మోడ్లో రెండు లక్షలు ఉచితంగా ఆరోగ్య భీమా విధానాన్ని అమలు పరచాలని అదేవిధంగా హైబ్రిడ్ మోడ్లో 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రతి కుటుంబానికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య మిత్ర దళిత ,గిరిజన కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య, రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి స్వాగతించారు. ఒక ప్రకటనలో ఆయన తెలుపుతూ. ముందుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న2100 ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం మరియు, ఉద్యోగ భద్రత, క్యాడరు, కల్పించాలని పథకం ప్రవేశపెట్టి ముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులతో ముందుకు చర్చించి మా యొక్క సార్థక బాధలను గ్రహించి మాకు రావలసిన ఉద్యోగ భద్రత శాలరీ పెంపు ఆరోగ్య బీమా విధానంలో వెళుతున్న సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే పథకంలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకొని న్యాయం చేయాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో గత సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన నాయకులతో చర్చల సారాంశమును మినిట్స్ రూపంలో ఇవ్వాలని క్యాడరు, జీతాల ఫైలు వెంటనే పంపించే విధంగా అధికారులకు ఆదేశివ్వాలని ,ఆంధ్రప్రదేశ్ దళిత, గిరిజన ,వైద్య మిత్ర కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.(Story : ఆరోగ్య భీమా అమలపరచడాన్ని స్వాగతించిన ఆరోగ్య మిత్ర)