పన్నుల బాదుడు మాని, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి
న్యూస్‌తెలుగు/వనపర్తి: పన్నుల బాదుడు మాని, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కోరారు. గతంలో అక్రమంగా తీర్మానం చేసిన చెత్త సేకరణ పన్ను రద్దు చేయాలని కోరారు. వార్డులలో అనవసరపు బోర్లు, వన్ ఇంచ్ పైపులైన్ల అవినీతి పై చర్యలు తీసుకోవాలని అన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా గతంలో పక్క రాష్ట్రం ఏపీలో చెత్త పన్ను సేకరణ పై పన్ను విధిస్తే ఇక్కడున్న మున్సిపాలిటీ కూడా తీర్మానం చేశారు. వీరిని చూసి అక్కడక్కడ చెత్త పన్ను సేకరణ పనులు వేయడం జరిగిందనిని అన్నారు.
ప్రభుత్వం మారాక గద్వాల్, మహబూబ్‌నగర్‌లో చెత్త పన్ను సేకరణ ఎత్తివేశారు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఏపీలో కూడా నూతన ప్రభుత్వం చెత్త సేకరణ పనులు ఎత్తివేసింది. మరి వారిని చూసి చెత్త సేకరణ పనులు వేసిన వనపర్తి మున్సిపాలిటీలో ఉన్నది. అదీకాక ఒక ఇంట్లో ఐదు పోర్షన్లు ఉంటే ఐదు పోర్షన్లకు టాక్స్ వసూలు చేస్తూ అవినీతికి పాల్పడ్డారు. గతంలో మేము పలుమార్లు కలెక్టర్ కి ,మిగతా అధికారులకు విన్నవించుకున్నాము. కనుక చెత్త సేకరణను వెంటనే రద్దు చేయాలని, ప్రజలపై అదనపు భారం ఎత్తివేయాలని, కలెక్టర్ కి ఎమ్మెల్యే కి డిమాండ్ చేస్తున్నాము.
కౌన్సిల్ ముగిసే ముందు జేబులు నింపుకోవడానికి ఇష్టానుసారంగా బోర్లు వేసి, ప్రతి వార్డ్ లో ఐదు లక్షల వరకు 1 ఇంచ్ పైపులైన్లు వేసుకునేందుకు తీర్మానం చేశారు దానివలన వనపర్తి లోని ఇళ్లలో బోర్లన్ని ఎండిపోతాయి. ఈ అవినీతిపై విచారణ చేయాలని మేము డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు, వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి సతీష్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, రమేష్, వేణు, యాదగిరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. (Story: పన్నుల బాదుడు మాని, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి)