కామ్రేడ్ వీరిశెట్టి సీతయ్య స్మారక స్థూపాన్ని ధ్వంసం చేసిన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : కారంపూడి రోడ్డు కళ్యాణపురి కాలనీ ఆర్సీ ఎదురుగా ఉన్న కామ్రేడ్ వీరిశెట్టి సీతయ్య స్మారక స్థూపాన్ని పగల కొట్టిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినుకొండ టౌన్ సి.ఐ శోభన్ బాబు కి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము మాట్లాడుతూ. కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే అయిన పులుపుల వెంకట శివయ్య సహచరుడు కామ్రేడ్ వీరిశెట్టి సీతయ్య వినుకొండ పంచాయతీ ఉపసర్పంచిగా పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని బడుగు బలహీనవర్గాల కోసం నిరంతరం కష్టపడిన గొప్ప వ్యక్తిని వీరి పేరుని కారంపూడి రోడ్ లోని ఒక వీధికి సీతయ్య నగర్ గా నామకరణ కూడా చేయడం జరిగిందని, అటువంటి గొప్ప నాయకుడిని ప్రజలు నిత్యం స్మరించుకుంటూ ఉండాలని వీరిశెట్టి సీతయ్య సతీమణి వీరిశెట్టి గాలెమ్మ కోరిక మేరకు ఆనాడు ఉన్న సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో వీరిశెట్టి సీతయ్య సొంత పొలాల్లో వీరిశెట్టి సీతయ్య స్మారక స్థూపాన్ని సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి నిర్మించిందని నేడు రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చేటప్పటికి సీతయ్య స్మారక స్థూపాన్ని పగలకొట్టి ఆ స్థలాన్ని కోట్లల్లో విక్రయాలు చేయాలని కొంతమంది వ్యక్తులు సీతయ్య స్థూపాన్ని, సీతయ్య సమాధులను, ఆయన సతీమణి వీరిశెట్టి గాలమ్మ సమాధులను, సీతయ్య తల్లి సమాధి కూడా పగలగొట్టి ఈ స్థలాన్ని కోట్లల్లో విక్రయాలు చేయాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పోలీసు వారు వెంటనే ఈ స్థూపాన్ని పగలగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు పఠాన్ లాల్ ఖాన్, కొండ్రముట్ల సుభాని, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, సుబేదార్, యూనిస్, ఎస్. కె.మస్తాన్వలి, కొప్పరపు మల్లికార్జున, రాయబారం వందనం, పొట్లూరి వెంకటేశ్వర్లు, జల్లి వెంకటేశ్వర్లు, మరీ బాబు, తదితర నాయకులు పాల్గొన్నారు.(Story : కామ్రేడ్ వీరిశెట్టి సీతయ్య స్మారక స్థూపాన్ని ధ్వంసం చేసిన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి)