Home వార్తలు తెలంగాణ అక్రమ కట్టడాల‌పై చర్యలు తీసుకోవాలి

అక్రమ కట్టడాల‌పై చర్యలు తీసుకోవాలి

0

అక్రమ కట్టడాల‌పై చర్యలు తీసుకోవాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కె విజయరాములు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో బాబా కాలనీలో నీ టీఎన్జీవో బిల్డింగ్ పక్కనఉన్న 20 ఫీట్ల రోడ్డుకు అడ్డంగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమ కట్టడాన్ని చేస్తున్న మాజీ ఎంపీపీ బంగారు శ్రీను పై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాబా కాలనీలో నిర్మించిన వెంచర్లో 10% ల్యాండ్ పూర్తి వివరాలు ఇవ్వాలని ఆత్మకూరు పట్టణంలో అనేక వెంచర్ల లో ఉన్న 10% ల్యాండ్ కమ్యూనిటీ పర్పస్ కోసం ప్రజల అవసరాల కోసం 10% ల్యాండ్ వెంచర్ల లో తప్పనిసరిగా ఉండాలని అది మున్సిపాలిటీ పరిధిలో అప్పటి గ్రామ పంచాయతీ ఇప్పటి మున్సిపాలిటీ పరిధిలో ఉండాలి కానీ ఈ ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాదారుల చేతులకు అసెస్మెంట్ నెంబర్లు ఇచ్చి మున్సిపల్ కమిషనర్లు టిపివోలు పర్మిషన్లు ఇచ్చి 10% ల్యాండ్లను కబ్జా గార్ల చేతుల్లో పెట్టారు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మండల సహాయ కార్యదర్శి కే మోష అమరచింత మండల కార్యదర్శి అబ్రహం ,భాస్కర్, ఏఐవైఫ్ నాయకులు ఎండి కుతుబ్ c.n.శెట్టి ,రవీందర్, శేఖర్, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story: అక్రమ కట్టడాల‌పై చర్యలు తీసుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version