గ్రూప్-2 పరీక్షల కోసం పటిష్టమైన ఏర్పాట్లు
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
న్యూస్‌తెలుగు/అనంతపురం : ఈనెల 23వ తేదీన ఆదివారం నిర్వహించే ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలో ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు నిర్వహించే ఎస్.ఎస్.బి.ఎన్ మరియు ఎస్.వి డిగ్రీ కళాశాలల్లో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు. కళాశాలల్లో సీసీటీవీ కెమెరాలు అన్ని పనిచేసేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, జడ్పి సిఈఓ రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రూప్-2 పరీక్షల కోసం పటిష్టమైన ఏర్పాట్లు)