ఆర్.బి.ఎస్.కే ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కే) MHT- 2,4 టీం ల ఆధ్వర్యంలో గురువారం వనపర్తి మండల పరిధిలో గల చిట్యాల,నాగవరం ఎం.జె.పి లు,జడ్పీ.హెచ్.ఎస్,మైనార్టీ స్కూల్ లలో 6,7,8,9 తరగతులు చదువుతున్న 100 మంది విద్యార్థుల ను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఆర్.బి.ఎస్.కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పరిమళ లు హాజరైనారు.వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో,కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కి వైద్య పరీక్షలు నిర్వహించి ఏ విధమైన లోపాలు కనిపించిన వారికి చికిత్స అందించాలని ఆర్.బి.ఎస్.కే సిబ్బందికి సూచించారు.ఆరోగ్యపరంగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు వివరిస్తూ ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగ పర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డా” శ్రీధర్,ఆర్.బి.ఎస్.కే ఎం.హెచ్.టి 2,4 టీం ల సిబ్బంది డా”.స్వప్న,డా”రఘు,డా” మతిన్, ఫార్మసిస్టులు శ్రీవిద్య, ఫైజాశబ్నం,పీ.ఎం.వో మురళి, ఏ.ఎన్.ఎం లు లక్ష్మి,విజయ తదితరులు ఉన్నారు. (Story : ఆర్.బి.ఎస్.కే ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు)