రమావత్ హైమా నాయక్ కుటుంబానికి చీఫ్ విప్ జీవీ పరామర్శ
న్యూస్ తెలుగు /వినుకొండ :ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి మృతి చెందిన రైతు రమావత్ హైమా నాయక్(45) కుటుంబాన్ని గురువారం ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరామర్శించారు. అన్నివిధాలుగా అండగా ఉంటాము, అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం హనుమాపురం గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో రమావత్ హైమా నాయక్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనతో దిక్కు తోచనిస్థితిలో పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో హైమా నాయక్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని ఓదార్చారు. అవకాశం ఉన్న మేరకు అన్ని మార్గాల్లో వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. (Story : రమావత్ హైమా నాయక్ కుటుంబానికి చీఫ్ విప్ జీవీ పరామర్శ)