తులసిపాక వైద్యాధికారి ఆశ్రమ పాఠశాల ఆకస్మిక సందర్శనలు
న్యూస్ తెలుగు /చింతూరు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ఉదయ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య మండలంలోని ఏ పి ఆర్, ఏ జీహెచ్ఎస్ నరసింహాపురం ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. బాల, బాలికల ఆరోగ్య సమస్యల గురించి తెలియజేసి కొన్ని ముఖ్య సూచనలు చేశారు. రానున్న కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున విద్యార్థులు నీడలో ఉండాలన్నారు. పుష్కలంగా నీరు తాగి, ఒక లీటరు నీటిని వేడి చేసి చల్లార్చి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌ను సీసాలో వేసుకుని తాగాలి. అలాగే, పోషకాహారం తీసుకోవాలని, వేసవిలో, చెమట కారణంగా దద్దుర్లు, దురద తరచుగా సంభవిస్తాయి. అందుచేత ఇతరుల బట్టలు వేసుకోకూడదు, వాడిన టవల్ మరొకరు వాడకూడదు, వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని,ఎండలో ఆరబెట్టాలన్నారు . అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం పూట తలుపులు మూసేయడం, కిటికీలకు తెరలు వేయడం, బెడ్‌పై దోమతెరలు వేయడం, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . అలాగే మనం తినే పండ్లు, ఆహార పదార్థాలను ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలన్నారు . వాంతులు, విరేచనాలు, నీరసం, రక్తహీనత మొదలైన వాటిని నివారించడానికి మనం జాగ్రత్తగా ఉండాలని తెలిపారు . ఈ హెల్త్ క్యాంప్ లో డిప్యూటీ డి యం అండ్ హెచ్ ఓ.పుల్లయ్య . డాక్టర్ యస్ ఉదయ్ కుమార్ రెడ్డి. హెచ్ ఈ ఓ ముక్తేశ్వరరావు. హెచ్ వి . సరోజిని .హెచ్ యస్ గంగరాజు. ఎ యన్ యం లు చిన్న లక్ష్మి .రోజా రమణి. ధర్మేంద్ర ఆశా వర్కర్లు పాల్గొన్నారు. (Story : తులసిపాక వైద్యాధికారి ఆశ్రమ పాఠశాల ఆకస్మిక సందర్శనలు)