శివాజీ జీవితం ప్రతి భారతీయుడికీ ప్రేరణ
న్యూస్ తెలుగు/సాలూరు : శివాజీ జీవితం భారతీయులందరికీ ఒక ప్రేరణగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వెలమపేట లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ జీవితం ప్రతి భారతీయుడికీ ప్రేరణ అన్ని ఆమె అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప యోధుడు, సమర్థ పరిపాలకుడని అన్నారు ఆయన ధైర్యం, రాజకీయం, యుద్ధ వ్యూహాలు, ప్రజాస్వామ్య భావనలు నేటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని అన్నారు.శివాజీ స్వరాజ్య స్థాపనకు పాటుపడి, విదేశీ ఆక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఆయన జీవిత గాథ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అనుసరిస్తూ, సమాజ సేవలో ముందుండాలి” అని అన్నారు.
శివాజీ మహారాజ్ స్వదేశీ భావనకు ప్రతీక. ఆయన పరిపాలనా విధానాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేవి. శక్తిమంతమైన నౌకాదళాన్ని అభివృద్ధి చేసి, దేశ రక్షణలో కీలకపాత్ర పోషించారని అన్నారు మనం శివాజీ ఆశయాలను అనుసరించి, దేశ అభివృద్ధికి కృషి చేయావలసిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు. శ్యామలాంబ ఆలయ కమిటీ చైర్మన్ అక్కిన అప్పారావు. కౌన్సిలర్లు వైకుంఠపు హర్షవర్ధన్ హైందవ ధర్మసేన సభ్యులు పాల్గొన్నారు. (Story : శివాజీ జీవితం ప్రతి భారతీయుడికీ ప్రేరణ)