ప్రజలు జగన్ బట్టలు ఎప్పుడో ఊడదీశారు
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా చీఫ్ విప్ జీవీ ప్రచారం
న్యూస్ తెలుగు / వినుకొండ : పోలీసు అధికారులు, ఉద్యోగులపై జగన్ అవాకులు, చవాకులను తీవ్రంగా ఖండిస్తున్నామని, 151 నుంచి 11 సీట్లతో ప్రజలు ఎప్పుడో అతడి బట్టలూడదీశారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని, ప్రజలు డ్డుపై నిలబెట్టినా బుద్ధిరాలేదని చురకలు వేశారు. హత్యలు, కిడ్నాపులు, దుర్మార్గాలు చేసినోళ్లను జైలుకెళ్లి మరీ ఎవరైనా పరామర్శలు చేస్తారా, జగన్ చట్టాల్ని గౌరవించేవాడైతే ఇలాంటి సంఘవిద్రోహ శక్తులను వెనకేసుకొస్తాడా అని తూర్పారాబట్టారు. ఇదే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మరోసారి జగన్ బట్టలిప్పడం ఖాయమన్నారు. వైకాపా పాలన లో ఏనాడు పోలీసులు, ఉద్యోగులను గౌరవించ లేదని, ఐఏఎస్, ఐపీఎస్‌లనూ ఇబ్బంది పెట్టా రని ఇంకా ఆటవిక రాజ్యం నడుస్తుంది అనుకుంటే కుదరదన్నారు. కృష్ణా – గుంటూరు పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలి కోరుతూ వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రచారం చేశారు. ఉదయం టీ స్టాళ్ల వద్ద పట్టభద్రులను కలిసి ఆలపాటికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, కారంపూడి రోడ్డులోని టీ స్టాళ్ల వద్ద పట్టభద్రులు, ఉద్యోగులను ఆత్మీయంగా పలకరించి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పై జగన్ నోరు పారేసుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లో క్షమించలేమన్నారు. ప్రజలు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చినా మారని జగన్ ఇకనైనా భూమ్మీద నడిస్తే వాస్తవం కనిపిస్తుందన్నారు. జగన్‌ను నమ్మిన విశాల్ గున్నీ, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా టాటా పరిస్థితి ఏమైందో గమనించాలని సూచించారు. నటి జెత్వానీ, రఘురామకృష్ణంరాజు కేసుల్లో తప్పులు చేసిన అధికారులు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని.. వెధవ పనులు చేసిన వారందరికీ అథోగతే పట్టిందన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం, గుట్కాలు, గంజాయి కనపడకుండా చేసిన పోలీసుల్ని శభాష్ అనాల్సింది పోయి దుర్భాషలాడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు పాలనలో పోలీసు విభాగం గౌరవం పెరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అభివృద్ధితో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్న జీవీ ఆధిక్యాలపైనే ఇప్పుడు దృష్టి పెట్టామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరు ఆలపాటికి, కూటమి ప్రభుత్వానికి అండగా ముందుకు రావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులను గాలికి వదిలేస్తే కూటమి వచ్చాక జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని, పరిశ్రమలు పెట్టి 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పించను న్నామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, బిజెపి నాయకులు లెనిన్, తదితరులు పాల్గొన్నారు.(Story : 11 సీట్లకు పడగొట్టి ప్రజలు జగన్ బట్టలు ఎప్పుడో ఊడదీశారు)