గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన గోపాల్ రావు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ స్వామి వ్రత తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గోపాలరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు ప్రతి వ్యక్తి జీవితంలో నూతన గృహ నిర్మాణం అనేది ఒక కలగా ఉంటుందని ఆకలను సార్ధకం చేసుకునేందుకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటే తప్ప నూతన గృహ నిర్మాణం చేపట్టలేమని నూతన గృహం నిర్మాణం చేసుకున్న గోపాలరావును ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో చుట్టాల గ్రామ నాయకులు రఘుపతిరావు, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. (Story : గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే)