శ్రీ చైతన్య లో “ఫ్యామిలీ బ్లూమ్ లివింగ్ కార్యక్రమం
న్యూస్‌తెలుగు/విజయనగరం : విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువ లకు తెలియజేయాలని శ్రీ చైతన్య ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ బ్లూమ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా బుధవారం స్థానిక రింగ్ రోడ్ లో గల పాఠశాలలో విద్యార్థినీ,విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, గ్రాండ్ పేరెంట్స్ కు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రాంతీయ సంచాలకులు వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమా లు విద్యార్థులకు భవిష్యత్తును తీర్చిదిద్ద గలవని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. శ్రీధర్ బాబు మాట్లాడుతూ శ్రీ చైతన్య కార్యక్రమా ల్లో అత్యున్నతమైన కార్యక్రమం ‘ఫ్యామిలీ బ్లూ లివింగ్ ప్రోగ్రాం’ అని చెప్పక తప్పదని తెలియజేశారు.అలాగే కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని వారి పిల్లలకు వారి యొక్క దీవెనలు అందించారు. పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైస్. ప్రిన్సిపాల్ ఎం. విక్రమ్, పాఠశాల డీన్ల్ సూర్య చంద్ర, కే. సత్యనారాయణ,చిన్నం నాయుడు, ఎస్ బ్యాచ్ఇం చార్చ్ శేషగిరి, హరికృష్ణ తదితరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : శ్రీ చైతన్య లో “ఫ్యామిలీ బ్లూమ్ లివింగ్ కార్యక్రమం)