Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు

జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు

0

జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు

2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు

న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాలతో విజయనగరం 2వ పట్టణ సిఐటి.శ్రీనివాసరావు, సిబ్బంది కలసి పట్టణంలోని లంకాపట్నంలో ప్రజలు, యువతకు మాదకద్రవ్యాల వినియోగం
వలన కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం 2వ పట్టణ పోలీసులు లంకాపట్నంలోని ఇంటింటికి తిరిగి మాదకద్రవ్యాలు వినియోగించడం వలన కలిగే అనర్థాలను వివరించి, వాటి జోలికి పోకుండా ఉండాలని కోరారు. మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు అరెస్టులు చేపట్టేకంటే అవగాహన కల్పించడంతోనే నిర్మూలించవచ్చునని భావించి యువతలో చైతన్యం తీసుకొని వచ్చి, వారిని మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులు కాకుండా చేసేందుకు, చెడు అలవాట్లు నుండి బయటపడేందుకు ‘సంకల్పం’ అనే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు, యువత
ఒకసారి డ్రగ్స్ వినియోగిస్తే ఏమీ కాదన్న భ్రమలో ఉంటారని, కాని డ్రగ్స్ వినియోగించడం ప్రారంభిస్తే త్వరితగతినబానిసలుగా మారుతారన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. డ్రగ్స్ కు బానిసలుగా మారిన యువతకు వారి చెడు అలవాట్లుకు సరిపడే డబ్బులు లేక చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి దురదృష్టవసాత్తు నేరస్థులుగా మారుతున్నారన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని, వారి నడవడికను గమనించాలని, వారు మాదకద్రవ్యాల జోలికి పోకుండా చూడాలని 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు కోరారు.
మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను తెలియపరుస్తూ 2వ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలు యువత ప్లకార్డులను పట్టుకొని లంకాపట్నంలో ర్యాలీని నిర్వహించారు. ప్రజలందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్పైలు కృష్ణమూర్తి, కనకరాజు, చంద్ర,
ఎఎస్ఐలు వై.పైడితల్లి, జి. అర్జున్, ఇతర పోలీసు సిబ్బంది, లంకాపట్నం
ప్రజలు పాల్గొన్నారు. (Story ;జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version