ఘనంగా జిల్లా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం..
డిగ్రీ కాలేజీ లో రక్తదాన శిబిరం
న్యూస్ తెలుగు/ చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని చింతూరు డివిజన్లో చట్టి లో గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాత భవనాన్ని సందర్శించి ఆ గ్రామ ప్రజలకు వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం చింతూరు డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేసి 18 యూనిట్లు రక్తాన్ని సేకరించి చింతూరు ఏరియా ఆసుపత్రికి అందజేశారు. జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భవించి మూడు సంవత్సరాలు కాలంలో పలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఏజెన్సీ వ్యాప్తంగా ఉచితంగా రక్తాన్ని అందజేస్తున్నామని విపత్తు సమయంలో అత్యవసర పరికరాలను సహాయక చర్యలు చేపట్టి అందజేస్తున్నామన్నారు. విద్యార్థిని విద్యార్థులకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించి ఆరోగ్యవంతంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని పలు వైద్య శిబిరాలు నిర్వహించి కంటి సస్థసికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు. నూతన కార్యవర్గం జిల్లా వ్యాప్తంగా పాడేరు రంపచోడవరం చింతూరు డివిజన్ల పరిధిలో 22 మండలాలను కలుపుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఔత్సాహిక యువతి యువకులు ఆయా శాఖల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు వ్యాపారస్తులు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన కార్యవర్గం విస్తృతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అధికారులు ఉద్యోగులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతూరు తాసిల్దార్ చిరంజీవి ,ఎంపీడీవో రామకృష్ణ ,డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రత్నమాణిక్యం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరీ శంకర్, కోశాధికారి సూర్యారావు, కార్యవర్గ సభ్యులు ప్రసాద్ నాయుడు, కృపాకర్, గాంధీ బాబు, మర్లమని తదితరులు పాల్గొన్నారు.(Story : ఘనంగా జిల్లా రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవం..)