హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన పోరాట యోధుడు చత్రపతి శివాజీ
న్యూస్ తెలుగు /సాలూరు : హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన పోరాట యోధుడు చత్రపతి శివాజీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బుధవారం సాలూరు పట్టణంలో గల శివాజీ బొమ్మ సెంటర్ లో ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భారతదేశంలో గొప్ప రాజులు ఉన్న ప్రజలందరూ చత్రపతి శివాజి నే ఎందుకు పూజించుకుంటున్నారంటే దానికి కారణం మొగలుల దాడులు నుండి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ చట్టాన్ని హిందూ సంస్కృతిని రక్షించిన ఘనత ఈ మరాఠా వీరుడు శ్రీ చత్రపతి శివాజీ కే దక్కుతుందని అన్నారు.ప్రతి ఒక్క హిందువు ఆయన్నిపూజించుకుంటున్నారంటే దానికి కారణం హిందూ మతం వారు ఇచ్చిన స్ఫూర్తితో అభివృద్ధి చెందిందని అన్నారు.మన లక్ష్యాలను సాధించడానికి ఆయన స్ఫూర్తి ఎంతో దోహత పడుతుందని అన్నారు. అతి చిన్న వయసులోనే ఆయన ఆలోచనలతో దేశాన్ని ఏ విధంగా రక్షించాలని వ్యూహాలు పన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు. గుల్లిపల్లి నాగ వైసీపీ నాయకులు కొల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. (Story : హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన పోరాట యోధుడు చత్రపతి శివాజీ)