ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
న్యూస్ తెలుగు /చింతూరు : మరాఠా సామ్రాజ్య వీరుడు చత్రపతి శివాజీ 135 జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శివాజీ ఫోటో కి పూలదండలు వేసి, పూలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ చేసిన యుద్దాల గురించి స్మరిస్తూ భావితరాలకు శివాజీ మహారాజ్ చరిత్రను తెలియజేసే ఆవశ్యత ఎంతైనా ఉంది అని సమావేశంలో పలువురు వ్యక్తులు మాట్లాడారు.. మన్యంలో యువత ముందుకు వచ్చి ఇలాంటి మంచి చైతన్యమైన కార్యక్రమలు చెయ్యడం పట్ల పలువురు అభినందించారు.. ఈ కార్యక్రమంలో పయ్యల నాగేశ్వరరావు,బొజ్జ పోతురాజు,గడ్డం సురేష్,బాలాజీ, మునగంటి భాస్కరా చారి ,విష్ణు,జంపన్న,, మల్లిపూడి. ప్రదీప్ సతీష్,వేణుగోపాల్, పోసేశ్వరవు,వెంకన్న,రాజు,నవీన్,సాయి,కప్పు(ప్రవీణ్),ప్రసన్న,హర్షవర్ధన్ రెడ్డి,అయ్యప్ప,తమ్మినేడి వెంకట రామారావు, యర్రం కాశి,దుర్గ రెడ్డి,హర్ష తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి)