సోర్స్ సెగ్రిగేషన్ పై విద్యార్థులకు అవగహన
న్యూస్ తెలుగు /వినుకొండ : స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ వినుకొండ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో భాగంగా మంగళవారం స్థానిక శ్రీ చైతన్య స్కూల్ నందు సోర్స్ సెగ్రిగేషన్ అవేర్నెస్ పై విద్యార్థుల కు అవగహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెల లో థీమ్– సోర్స్ సెగ్రిగేషన్ అవేర్నెస్ కాంపెయిన్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం వినుకొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు మూడు డబ్బాల వాడకం చెత్తను వేరు( తడి పొడి మరియు గృహ సంబంధిత ప్రమాదకర) చేయుట, సింగల్ యుజ్ ప్లాస్టిక్ వల్ల కలుగు నష్టాలు, మరియు వ్వక్తిత్వ వికాసం, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : సోర్స్ సెగ్రిగేషన్ పై విద్యార్థులకు అవగహన)