అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న
ఎక్సైజ్ పోలీసులు
న్యూస్‌తెలుగు/చింతూరు : వైరామవరం మండలం చౌటుదిబ్బలు కు వెళ్లాల్సిన 13 బీరు కేసులు, 11 కేసుల లిక్కర్ ను ఏ పి 39.యు 9154 అనే ఆటోలో మంగళవారం చింతూరు మండల కేంద్రం లో వున్న వైన్ షాప్ యాజమాని అక్రమంగా తరలిస్తుండగా చింతూరు ఎక్సైజ్ ఎస్సై వై. వీర వెంకట సత్య లక్షణ స్వామి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ రు 1 లక్ష 12 వేలు ఉంటుందని తెలిపారు.మద్యంతోపాటు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు . (Story : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు)