చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల బంద్: ఆంధ్ర పోలీసుల అలర్ట్!
న్యూస్‌తెలుగు/చింతూరు: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతంలోని చింతూరు, వీ ఆర్ పురం, కూనవరం, ఎటపాక పోలీస్ స్టేషన్ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ మేరకు చింతూరు యస్ ఐ రమేష్ స్టేషన్ పరిధిలోని ఉన్న రాజకీయ నాయకులందరినీ అప్రమత్తం చేసి నోటీసులు జారీ చేశారు. అంతేగాక విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. భద్రాచలం వైపు వెళ్లే బస్సులు వాహనాలన్నిటినీ కూనవరం వైపు మళ్ళించారు. బంద్ సందర్భంగా అల్లిగూడెం వెళ్లే బస్సును రద్దు చేసినట్లు తెలిపారు. కొత్త వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని దుర్గాప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (Story: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల బంద్: ఆంధ్ర పోలీసుల అలర్ట్!)