అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి
మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి
న్యూస్ తెలుగు/చింతూరు: అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా చట్టి లో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం ముందు సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఉద్దేశించి సీఐటీయూ చింతూరు మండల ప్రధాన కార్యదర్శి పోడియం లక్ష్మణ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో పేద గర్భిణీలు. బాలింతలు చిన్నపిల్లలకు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారు. అంగన్వాడి సెంటర్ నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. అంగన్వాడీలకి వేతనాలు పెంపు తదితర సమస్యలు పరిష్కారం కొరకు 42 రోజులు పాటు చరిత్రత్మక సమ్మె నిర్వహించామని,సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకు 2024 జులైలో వేతనాలు పెంచుతామన్న ప్రభుత్వం నేటికీ పెంచలేదని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని మినిట్స్ ఇచ్చారని, అయినా నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మాస్క్ జీవో వెంటనే ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్ కు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలన్నారు.పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్ట్లు వెంటనే భర్తీ చేయాలని, అంగన్వాడి కార్మికులకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి నూక రత్నం. వర్కర్లు. వసంత. పార్వతి. సుక్కమ్మ. లలిత. తదితరులు పాల్గొన్నారు. (Story: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి)