తహసీల్దార్‌ను కలిసిన దళిత సంఘం నేతలు
న్యూస్ తెలుగు/చింతూరు: చింతూరు దళిత కుటుంబ సంక్షేమ సంఘం నాయకులు చింతూరు తహసీల్దార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా సోమవారం కలవడం జరిగింది. అనంతరం కార్యనిర్వాహక సభ్యులు చింతూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణం కొరకు స్థలం ఇప్పించవలసినదిగా కోరడం జరిగింది. అందుకు తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అధ్యక్షులు మెల్లెం నాగేంద్ర, లాడే శ్రీనివాసరావు, నక్కా రజని కుమార్, గౌరవ అధ్యక్షులు సాగర్, పట్రా రమేష్, ట్రజరర్ గుండెపోగు శ్రీనివాస్, పట్రా జీవరత్నం, కట్టా శ్రీను, కట్టా రామకృష్ణ, వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. (Story: తహసీల్దార్‌ను కలిసిన దళిత సంఘం నేతలు)