కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి: తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక్కడిగా బయలు దేరి శూన్యంలో సునామీ సృష్టించి తెలంగాణ రాష్ట్రం సాధించిన మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్, ఎడారిని తలపించిన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పంట పొ లాలుగా మార్చిన కెసిఆర్ కృషిని గుర్తుచేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా, పట్టణ, మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి పట్టణ, మండల, గ్రామాలలో వృక్షార్చాన చేపట్టి విరివిగా మొక్కలు నాటి మరో హరితహారానికి శ్రీకారం చుట్టాలని, అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాలు (రక్తదాన శిబిరాలు, అన్నప్రసాద వితరణ, దేవాలయాలలో, చర్చి, మసీదుల్లో ప్రార్థనలు) చేపట్టాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. (Story: కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి)