ఫిబ్రవరి 21న ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’
జాన్వీ నారంగ్ మాట్లాడుతూ.. ‘మేం ఓ కొత్త లవ్ స్టోరీతో రాబోతోంది. ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ఫిబ్రవరి 21న అందరి ముందుకు రాబోతోంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్ని ఇచ్చిన ధనుష్ గారికి థాంక్స్. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
అనికా సురేంద్రన్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం ఫిబ్రవరి 21న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సపోర్ట్ చేయండి. మా చిత్రాన్నితెలుగులో రిలీజ్ చేస్తున్న ఏషియన్, సురేష్ గార్లకు థాంక్స్’ అని అన్నారు.
నటి రబియా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంతోనే నేను ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. మేం అందరం కొత్త వాళ్లమే. ఈ సినిమాను అందరూ ఆదరించండి. ఫిబ్రవరి 21న థియేటర్లోకి మేం అంతా రాబోతోన్నామ’ని అన్నారు.
వెంకటేష్ మీనన్ మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 21న మా చిత్రం రిలీజ్ కాబోతోంది. మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
రమ్య రంగనాథన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు ఎక్కువగా రాదు. ఈ మూవీతోనే నేను తెరకు పరిచయం కాబోతోన్నాను. ఈ సినిమా ప్రమోషన్స్‌కు హైదరాబాద్ రావడం ఆనందంగా ఉంది. మా సినిమాను ఫిబ్రవరి 21న థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
పవిష్ మాట్లాడుతూ.. ‘వెంకీ అట్లూరి గారి వల్లే నేను కెమెరా ముందుకు రాగలిగాను. మా చిత్రం ఫిబ్రవరి 21న రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు. (Story :ఫిబ్రవరి 21న ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’)