హోదా వస్తే పెట్టుబడులు అవే వస్తాయి
8 నెలల్లో నే ప్రభుత్వం పై అసంతృప్తి
పేదల బతుకును గుర్తించడం లో సుప్రీమ్ కోర్ట్ విఫలం
23 న మన గ్యాస్ మనకే దక్కాలని కాకినాడలో సదస్సు
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
న్యూస్‌తెలుగు/చింతూరు : కేంద్రం రాష్ట్రనాకి ప్రత్యక హోదా ప్రకటిస్తే పెట్టుబడులు అవే వస్తాయి అని ప్రజలకు ఉపాధి పెరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు.
శనివారం ఉదయం స్థానిక మెరకవిది లో జట్ల లేబర్ యూనియన్ మేస్త్రీ ల సమావేశము యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు బాబు అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలు అప్పుల్లో ఉన్న విషయo మీకు తెలియదా అని ప్రశ్నించారు నేడు సూపర్ సిక్స్ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు
గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన విద్యుత్ బకాయిలను నేడు ప్రజలు నెత్తిన వేసిందని అన్నారు 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు స్మార్ట్ మీటర్లు అంశం లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదన్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్ప్ రేట్ లపై పన్నులు పెంచాలని మధు డిమాండ్ చేశారు అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కాకినాడ తీరంలో ఉన్న గ్యాస్ చమురు నిక్షేపాలను మనకు రావాలసిన వాటా ఇవ్వాలని కోరుతూ ఈ నెల 23 న కాకినాడ గాంధీభవన్ లో సదస్సు నిర్వహిస్తున్నామని అన్ని వర్గాల వారు హాజరై జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు
కేంద్ర బిజెపి సర్కార్ ప్రవేశ పెట్టిన 2025-26 బడ్జెట్ తీవ్ర ప్రమాదకరo గా ఉందని ఆయన అన్నారు . గతంలో అమలు చేస్తున్న సంస్కరణలను మరింత వేగంగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్ ప్రయత్నిస్తున్నదిని ముఖ్యంగా బడ్జెట్‌లో అప్పుల నిధులను సమకూర్చి మౌలిక సదుపాయాలను, సామాజిక రంగాలను, పౌర సేవలను ప్రైవేటు శక్తులకు ధారాదత్తం చేయడానికి, ప్రజలపై పెనుభారాలు మోపటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదిని విమర్శించారు
అప్పుల రూపంలో నిధుల విధానాన్ని ముందుకు తీసుకొచ్చిందిని రాష్ట్రాలను కూడా బలవంతంగా ఈ విధానంలోకి దించుతున్నదిని ప్రజలపై పెను భారాలు మోపటమే కాక మొత్తం ప్రభుత్వ ఆస్తులను, ప్రజల మౌలిక సదుపాయాలను, సేవలను, వనరులను ప్రైవేటు శక్తుల పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఈ ప్రమాదకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, రాష్ట్రాలు సమైక్యంగా పోరాడటమే ముఖ్యమైన కర్తవ్యo ని మధు అన్నారు
ఇంకా ఈ సమావేశం లో జట్ల సంఘము ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, ఉపాధ్యక్షులు పి దేముడు బాబు, కక్కల దుర్గా ప్రసాద్, రెడ్డి వెంకట రావు, నల్ల రామారావు, కాళ్ల అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. (Story : హోదా వస్తే పెట్టుబడులు అవే వస్తాయి)