విద్యా వ్యవస్థ పటిష్టం పై
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సైతం ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం పాఠశాలలో శనివారం విద్యార్థులకు, ఏకరూప దుస్తులు, విద్యాభ్యాస ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మాట్లాడుతూ గ్రామాలలోని పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు …
గ్రామస్తుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మాల రాములు వితరణ చేసిన విద్యాభ్యాసన ఉపకరణాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ విధంగా దాతలు ముందుకు వచ్చి పాఠశాల బలోపేతం కోసం పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు. రానున్న కాలంలో వనపర్తి జిల్లాలో శ్రీనివాసపురానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని జిల్లా మహిళా సమైక్య భవనం సైతం శ్రీనివాసపురం లోనే నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీనివాసపురం పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తాను ఎల్లవేళలా సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులను విద్యాభ్యాసన ఉపకరణాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, న్యాయవాది తిరుపతయ్య, స్థానిక మాజీ కౌన్సిలర్ విభూది నారాయణ విద్యాధికారులు,పాఠశాల ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : విద్యా వ్యవస్థ పటిష్టం పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి)