అంగన్వాడి కార్యకర్తల అవగాహన కలిగి ఉండాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పోషన్ భి పట్టాయి భి కార్యక్రమం పై అంగన్వాడి కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలని పల్నాడు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి అన్నారు.. వినుకొండ అర్బన్ ఏపీ గురుకుల ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ నందు 13, 14 ,15 నేటితో శిక్షణా తరగతులు ముగిశాయి. ఈ శిక్షణ తరగతులను వినుకొండ పట్టణ సూపర్వైజర్ శ్రీలత, సిడిపిఓ అనురాధ వీరి ఆధ్వర్యంలో తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల అభివృద్ధి కోసం మూడు రోజులపాటు పోషణ్ భి పట్టాయ్ భి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అవగాహన కార్యక్రమంలో ఉమాదేవి మాట్లాడుతూ. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ 1975 అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభమైందని, అప్పటినుండి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అంగన్వాడి సెంటర్ ను అనేక విధాలుగా కార్యక్రమాలను రూపొందించి అభివృద్ధి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులు పాటు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు శారీరక, మానసిక ఎదుగుదల ఆహారం ఎలా తీసుకోవాలి అనే పద్ధతులు నేర్పాలని, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ) పిల్లలకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, పరిశుభ్రత, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, కండరాల అభివృద్ధి, సృజనాత్మకత సంసిద్ధత ఉదయాన్నే లేవడం ప్రార్థనా సంభాషణ ఆటపాటలతో విద్యా వ్యాయామం వంటి నేర్పాలన్నారు. అదే విధంగా 0 నుండి 3 సంవత్సరాల పిల్లలకు క్రమాభివృద్ధి భౌతిక మరియు చలన అభివృద్ధి సామాజిక పోషణ మరియు సాక్ష్యం పోషణ ప్రకారం ఆహార పద్ధతులు తీసుకునే లక్షణాలు నేర్పాలని అన్నారు. దేశంలో మొత్తం 13 లక్షల 15 వేల 850 సెంటర్లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా బోధన అభ్యాసన నియమ నిబంధనలలో భాగంగా టీచర్లు ప్రార్థనతో ప్రారంభించాలని పునః చరణ శ్రద్ధగా వినాలని, ముఖ్యమైనవి రాసుకోవాలని, సమయపాలన పాటించాలని, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి అర్థం కాని విషయాలు అడిగి తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఎదిగే పిల్లలకు శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, సాంస్కృతిక సౌందర్య అభివృద్ధి గురించి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. (Story : అంగన్వాడి కార్యకర్తల అవగాహన కలిగి ఉండాలి)