సోనూ సూద్‌కు మంత్రి సంధ్యారాణి అభినందనలు
న్యూస్ తెలుగు/సాలూరు : అరుకు పార్లమెంట్ పరిధిలో ఉన్న మన్యం జిల్లాకు రెండు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రెండు సినీ నటుడు సోనూ సూద్ గొప్ప మనసు చేసుకొని నాలుగు అంబులెన్స్ లు ఇచ్చినందుకు గిరిజనుల ప్రజలందరూ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి సహాయపడే అరకు పార్లమెంట్ కు నాలుగు అంబులెన్స్ ఇవ్వడం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చేరో రెండేసి అంబులెన్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఇవ్వడం జరిగిందని అన్నారు. కరోనా టైం అప్పుడు చాలా మందికి ఆయన చేసిన సహాయం దేశ ప్రజలందరూ చూశారని అన్నారు. ఈరోజు గిరిజనుల కోసం ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఈ అంబులెన్స్ ను కొనడం చాలా అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు రోడ్లు, తాగునీరు మొదలైన కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రానికి ఇలాంటి దాతల సహాయం చేస్తే ఇంకా అభివృద్ది చెందుతుందని అన్నారు. ఈ అంబులెన్స్ లు ఇవ్వడం వలన సుధూరు ప్రాంతంలో ఉన్న గిరిజనులకు అత్యవసర వైద్య సేవలు వేగంగా అందించేందుకు ఉపయోగపడతాయని అన్నారు.(Story : సోనూ సూద్‌కు మంత్రి సంధ్యారాణి అభినందనలు )