విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి కార్యాలయ ఆవరణ లో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీ.శే. పొట్లూరి కోటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని వరలక్ష్మమ్మ ,కుమారుడు మురళీకృష్ణ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. గత 10 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం తో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దీనికి సంఘ సభ్యుల సహకారం ఎంతో ఉందన్నారు. ఇదేవిధంగా సంఘ సభ్యుల సహకారం ఎప్పటికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అవ్వారు కోటేశ్వరరావు, వై. వి. సుబ్బయ్య శర్మ, దుబ్బల దాసు, వెంకట స్వామి, నారాయణ రావు, శేషయ్య,ఏ. రామలింగేశ్వర రావు, బి.పి.ఎస్. సుందర్ రావు, జి. నాగేంద్రుడు, ఎం .వీ.శర్మ, ఎస్ ఎస్.ఎం. శాస్త్రి, హసన్, దీక్షితులు, శంకరరావు, కోటయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.(Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం )
