పేద ముస్లిం యువతి వివాహానికి జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ లక్ష రూపాయలు చెక్ అందజేత
న్యూస్ తెలుగు/చింతూరు : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న షేక్ రహమతుల్లా కూతురు వివాహానికి జెకేసి ట్రస్ట్ చైర్మన్ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ లక్ష రూపాయల చెక్కును రహమతుల్లాకు అందజేశారు. పేద కుటుంబానికి నివాసం కూడా సరిగా లేనందున తానే స్వయంగా ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్ సభ్యులు నాదర్ ఖాన్ అజీజ్, బాబు, జావేద్, సుభాని తదితరులు పాల్గొన్నారు.(Story : పేద ముస్లిం యువతి వివాహానికి జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ లక్ష రూపాయలు చెక్ అందజేత )