జర్నలిస్ట్ శ్రీను కుటుంబంకి ఆర్ధిక సహాయం
న్యూస్ తెలుగు/విజయనగరం : వార్త దినపత్రిక లో పనిచేస్తూ ఇటీవల బ్రెయిన్ స్టోర్క్ కి గురి అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ కుటుంబంకి సహచర జర్నలిస్ట్లు, కొంతమంది మానవతవాదులు అందరు కలిసి శ్రీను కుటుంబంకి ఆర్ధిక సహాయం చేసి మేమున్నాం అని భరోసా కల్పించారు. గురువారం శ్రీను చికిత్స పొందుతున్నఆసుపత్రికి చేరుకొని శ్రీను కుటుంబ సభ్యులును కలిసి అయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఓదార్చడం జరిగింది. అనంతరం శ్రీను సతీమణికి 50 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. అనంతరం హాస్పిటల్ బిల్ తగ్గింపు విషయంలో మాట్లాడి భారీ డిస్కౌంట్ ఇచ్చే విధంగా కృషి చేశారు. అలాగే ఆసుపత్రి యాజమాన్యం ఇకపై అయన వైద్యం విషయంలో ఇబ్బంది లేకుండా మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా శ్రీను సతీమణి తన భర్త శ్రీను కోసం సహాయార్ధం ఎంతోమంది సహచర జర్నలిస్టులు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని, సహాయం చేసిన వారందరికీ ధన్యవాదములు తెలిపారు. ప్రస్తుతం రూ. 50 వేలు అందజేయడం జరిగింది అని మిగిలిన మొత్తాన్ని కూడా రెండు మూడు రోజుల్లో అందజేస్తాం అని ఆమెకు తోటి జర్నలిస్ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ మిత్రులు 10టీవీ ఎన్.ఎం.ఎల్ నాయుడు, టీవీ 9 కోటేశ్వరరావు, డీడీ శివ ప్రసాద్, ప్రజాశక్తి రమేష్ నాయుడు, ఎం ఎస్ ఎన్ రాజు,నాగేంద్రప్రసాద్, హేమంత్ కుమార్, దయాకర్, గోవిందరావు, విశాలాంధ్ర ప్రతాప్, హరిష్ తదితరులు పాల్గొన్నారు.(Story : జర్నలిస్ట్ శ్రీను కుటుంబంకి ఆర్ధిక సహాయం )