మాత శిశు సంరక్షణ కేంద్రంలో రేడియాలజిస్ట్ ను వెంటనే నియమించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాత శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయించుకోవడానికి రేడియాలజిస్ట్ లేకపోవడంతో ప్రైవేటు స్కానింగ్ సెంటర్ లకు పంపడం ద్వారా అధిక భారంతో ఆందోళన చెందుతున్న సందర్భంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రెండు రోజు రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్ రెడ్డి,citu జిల్లా అధ్యక్షులు ఎం రాజు, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత,SWF కార్యదర్శి కృష్ణయ్య, ఖాయిము, dyfi జిల్లా ఉపాధ్యక్షులు మహేష్,మద్దిలేటి పాల్గొని మద్దతుగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ సెంటర్లో రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల అట్టడుగు వర్గాలగ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో పేదలు చాలా ఇబ్బందులకు గురై ప్రైవేటు స్కానింగ్ లొ డబ్బులు పెట్టుకొని చూపించుకోవడానికి భారంగా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రేడియాలజిస్ట్ ను నియమించాలని, చిన్నపిల్లలకు స్కానింగ్ చేసే యంత్రాలు నియమించాలని, మాత శిశు సంరక్షణ కేంద్రంలో అవసరమైన డాక్టర్స్ సిబ్బందిని వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు అన్ని వసతులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు గద్వాల సాయి లీల, జిల్లా కోశాధికారి కవిత, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమా, శాంతమ్మ, రేణుక, జిల్లా నాయకురాలు పార్వతి, మనమ్మ ,పద్మ, రజిత*చెన్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.(Story : మాత శిశు సంరక్షణ కేంద్రంలో రేడియాలజిస్ట్ ను వెంటనే నియమించాలి )