అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రావుల
న్యూస్‌తెలుగు/వనపర్తి: వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో శ్రీ అంబా భవాని అమ్మ వారి దేవాలయం లో ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమల సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, రావుల వరలక్ష్మి దంపతులు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ అంబా భవాని నూతన శిఖర, గరుడ స్తంభ, కలశ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పొగాకు మహేష్ పొగాకు ప్రసాద్ పొగాకు అనిల్ , కమిటీ సభ్యులు పూజా కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయమ్మ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాములు యాదవ్, ఐటీఐ కాలేజ్ చైర్మన్ విశ్వనాథ గంగాధర్, లింగేశ్వర్, శివ కుమార్ రెడ్డి, బాలయ్య నాయుడు, తిరుపతయ్య గౌడు. బీమా భారతి, భీమ విజయలక్ష్మి , ఎరుమలి నరసింహ, భీమ బాలకృష్ణ, భక్తులు, పెద్దలు, మహిళలు, పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, వరలక్ష్మి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులను వేద పండితులను ఘనంగా సత్కరించారు. (Story: అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రావుల)