Home వార్తలు పీసీ ఆదిత్యకు ఉత్తమ నటుటు అవార్డు

పీసీ ఆదిత్యకు ఉత్తమ నటుటు అవార్డు

0

పీసీ ఆదిత్యకు ఉత్తమ నటుటు అవార్డు

విశాలాంధ్ర/హైదరాబాద్‌: హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా టీవీ రంగాలలో పలు విభాగాలలో అందించిన అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా విలక్షణ దర్శకుడు, నిత్య ప్రయోగశీలి డాక్టర్‌ పిసి ఆదిత్యకు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేశారు. వంశీ టీవీ మరియు మోర్డు సంస్థల ఆధ్వర్యంలో జరిగినఈ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి ఎస్‌ వేణుగోపాలచారి, ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు ఉప్పల శ్రీనివాస్‌ గుప్త, డాక్టర్‌ వంశీకృష్ణ, డాక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్న అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు డాక్టర్‌ పి సి ఆదిత్య నటించిన సంచలనాత్మక లఘు చిత్రం వంతులో ఆదిత్య అసమాన నటన ప్రతిభను గుర్తించి ఉత్తమ నటుడిగా అవార్డును ప్రదానం చేశారు. ఆదిత్య శిష్యుడు డాక్టర్‌ రావుల మోహన్‌ రెడ్డి దర్శకనిర్మాతగా మారి ఈ వంతు లఘుచిత్రం నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో అవార్డులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సందేశాత్మక లఘు చిత్రంలో కొడుకుల చేతుల్లో మోసపోయిన తండ్రి పాత్ర లో డాక్టర్‌ పిసి ఆదిత్య అద్భుత నటనను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అవార్డు అందజేసిన చేసిన అతిథులు కార్యక్రమం నిర్వాహకులు ఆదిత్య అభినందించారు. ఈ సందర్భంగా ఆదిత్య స్పందిస్తూ అలుపెరిగిన తన సినీ ప్రయాణంలో నిరంతరం పలు ప్రయోగాలు చేస్తూ ఎందరో నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇస్తున్నానని, ఇది తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో కూడా తన నిర్మించే చిత్రాలలో లఘు చిత్రాలలో కొత్త వారికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆదిత్య ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సందర్భంగా ఆదిత్య అభిమానులు, శ్రేయోభిలాషులు ఆదిత్య అభినందనలు తెలియజేశారు. (Story: పీసీ ఆదిత్యకు ఉత్తమ నటుటు అవార్డు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version