మన్యం బంద్‌కు అనుమతుల్లేవ్
చింతూరు(న్యూస్ తెలుగు): చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో 11, 12 తేదీల్లో తల పెట్టిన బంద్ కు ఎటువంటి అనుమతులు లేవని చింతూరు ఎస్ఐ రమేష్ ఒక తెలిపారు. ఎం.ఎల్.సి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి అనుమతులు ఇవ్వబడవని తెలిపారు. ఇందుకు భిన్నంగా బలవంతంగా షాపులు మూయించడం, రోడ్డు పూర్తిగా మూసివేయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దగ్ధం చేయటం నేరమని పేర్కొన్నారు. ఈ విధమైన పనులు చేస్తే చట్ట రీత్యా చర్యలకు బాధ్యులు కాగలరని ఎస్ఐ తెలిపారు. (Story: మన్యం బంద్‌కు అనుమతుల్లేవ్)