దర్గాను దర్శించుకున్న చిన్న శ్రీను, బేబీ నాయిన
న్యూస్‌తెలుగు/విజయనగరం: హుజూర్ హజరత్ సయ్యద్ ఖాదర్ వలీ బాబా వారి 66 వ ఉరుసు మహోత్సవంలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ను సందర్శించి తమ భక్తి భావనను చాటుకున్నారు. ఉరుసు ప్రారంభం రోజున రాష్ట్ర ఎంఎస్ఎంఈ, పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు సాయంత్రం బాబామెట్టలోని ఖాదర్ బాబా దర్గా, దర్బార్ ను సందర్శించారు. ఆది, సోమవారాల్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు(చిన్న శ్రీను) ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, బొబ్బిలి రాజా బేబీ నాయినా, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డివిజీ శంకర్ రావు, జనసేన యువ నాయకులు అవనాపు విక్రమ్, గురానా అయ్యలు, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ, డీఎస్పీ చక్రవర్తి, చీపురుపల్లి వైసిపి నేత వలిరెడ్డి శ్రీను, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కాళ్ళ గౌరీశంకర్ తదితరులు ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. వీరికి చీమలపాడు దర్గా సూఫీ పీఠాధిపతి సజ్జదా నషీన్ మొహమ్మద్ ఖాజా మొహియుద్దీన్, విజయనగరం దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబు దర్బార్ సంప్రదాయం ప్రకారం మేళ తాళాలతో, ఫకీరు కవ్వాళీ నడుమ సాదర స్వాగతం పలికారు. ఖాదర్ బాబా దర్శనం అనంతరం భారీ లంగర్ ఖానాలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఉత్సవాలకు విచ్చేసిన అతిథులు తమ చేతుల మీదుగా ప్రారంభించి, భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. సోమవారం నిర్వహించిన కుల్, సలాంతో జాతీయ సమైక్యతను చాటే హజరత్ ఖాదర్ బాబా వారి 66 వ ఉరుసు సుగంధ మహోత్సవాలు ముగిశాయి. (Story: దర్గాను దర్శించుకున్న చిన్న శ్రీను, బేబీ నాయిన)