స్ఫూర్తిని రగిలించిన సన్మానం
శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ దస్తగిరి రెడ్డిని సన్మానించిన స్పిరిట్ మూవీ నరసమ్మ
న్యూస్‌తెలుగు/నంద్యాల: స్పిరిట్ మూవీ నరసమ్మ తనయుడు శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ నుంచి రూరల్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి.దస్తగిరి రెడ్డిని వారు హృదయపూర్వకంగా సత్కరించారు. కోచింగ్ సెంటర్ విద్యార్థుల హర్షధ్వానాల నడుమ నరసమ్మ, ఆయన కుమారుడు, దస్తగిరి చేసిన ప్రసంగాలు స్ఫూర్తిని రగిలించాయి. కాగా, నరసమ్మ తనయుడికి ఉద్యోగం రావటంతో నరసమ్మ తన స్పిరిట్ చిత్రం (స్పిరిట్-ఇట్స్ నాట్ వన్) నుంచి ఒక పాటని పి.దస్తగిరి రెడ్డి చేతుల మీదుగా శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాత నరసమ్మ కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆమె భర్త వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. (Story: స్ఫూర్తిని రగిలించిన సన్మానం)