వినుకొండ లో ఖాదర్ బాబా ఉత్సవాలు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మార్కాపురం రోడ్డు పసుపులేరు బ్రిడ్జి కోల్డ్ స్టోరేజ్ వద్ద ఖాదర్ బాబా ఉత్సవాలు ఎంతో వైభవ్వేతంగా కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ విప్,శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు లు పాల్గొని ఖాదర్ బాబా జండా వద్ద పూజలు మరియు బాబా విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఖాదర్ బాబా వారి మహిమలు అద్భుతమని ఎంతమంది మహిళా భక్తులు, దంపతులు ప్రజలు ఖాదర్ బాబా వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారని వారు ధన్య జీవులని ఈ సందర్భంగా కొనియాడారు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పురావూరి. బాబా వరప్రసాదరావు, కాసుల. గురునాథం, దోసపాటి. బాబు, బండి .వెంకటేశ్వర్లు, సుభాని మాస్టర్( రవీంద్ర స్కూల్) మేడం అశోక్ వి. మంగారావు గంగిశెట్టి. జగదీష్ బాబు, కాకుమాను. రామారావు, చీమకుర్తి. రత్నాకర్, బాబా. కోటేశ్వరరావు, గర్రె. నరసింహారావు,, గుంటకల్. నాగేశ్వరరావు, బద్రీనాథ్ , భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. (Story : వినుకొండ లో ఖాదర్ బాబా ఉత్సవాలు)