డబుల్ ఇంజిన్ సర్కార్‌పై నమ్మకానికి నిదర్శనం దిల్లీ గెలుపు
బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోట వెంకట సుధాకర్ కు జీవీ అభినందనలు
న్యూస్ తెలుగు/ వినుకొండ : దేశవ్యాప్తంగా ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్లపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం, ఆమోదానికి దిల్లీ ఎన్నికల్లో భాజపా ప్రభంజనమే నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే చేరే ముందు కూడా అదే చెప్పామని, ఇప్పుడు దేశం మొత్తంగా కూడా అదే అంగీకరిస్తోందన్నారు. ఒక బలమై లక్ష్యం కోసం బలమైన రాజకీయ నాయకత్వం అవసరమని, అది ఎన్డీయేతోనే సాధ్యమన్నారు.
భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన కోట వెంకట సుధాకర్ ను ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఆదివారం వినుకొండలోని జీవీ కార్యాలయంలో వెంకట సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోట వెంకట సుధాకర్ గతంలో పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ అనే త్రిమూర్తుల చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉందని, అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకుని వెళ్తోందన్నారు. కూటమి ప్రభుత్వం కారణంగానే అమరావతి, పోలవరం, హైవేలకు నిధులతో పాటు బడ్జెట్‌లో అనేక కార్యక్రమాలకు కేటాయింపులు సాధించుకోగలుగుతున్నామని తెలిపారు. (Story : డబుల్ ఇంజిన్ సర్కార్‌పై నమ్మకానికి నిదర్శనం దిల్లీ గెలుపు)