బిజెపి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ
న్యూస్‌తెలుగు/చింతూరు : రాజధాని ఢిల్లీ లో 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ సాధించి 70 స్థానాలు గాను 48 స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్న హాలు బిజెపి సాధించుకుంది. ఈ గెలుపును పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో బిజెపి గెలుపు పట్ల విజయోత్సవ ర్యాలీ శనివారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు దాసరి వెంకట రమణారెడ్డి ( చిట్టిబాబు )మూట మల్లేష్, మడవి చందర్రావు, శ్యామల లక్ష్మణరావు, మీడియం ప్రసాద్, శ్యామల రాజు, సోడి చంటి, మీడియం పుల్లయ్య, మడకం భీమయ్య, శ్యామల సురేష్, గొంది లచ్చు తదితరులు పాల్గొన్నారు.(Story : బిజెపి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ)