ఢిల్లీలో బిజెపి గెలుపు..వినుకొండలో సంబరాలు
న్యూస్ తెలుగు/ వినుకొండ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ సందర్బంగా నియోజకవర్గ బిజెపి ఇన్ ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ మాట్లాడుతూ. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని రకాల కుతంత్రాలు చేసినప్పటికీ అనేక రకాలుగా అబద్దాలను ప్రచారం చేసినప్పటికీ ఢిల్లీ ప్రజలు నిజమైన అభివృద్ధిని ఇచ్చే పార్టీగా భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నందుకు భారతీయ జనతా పార్టీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తుందన్నారు . మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు నేడు జరిగిన ఢిల్లీ ఎన్నికలు రేపు రాబోయే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల గెలుస్తారని భారతదేశాన్ని అగ్రదేశంగా నిలిపేందుకు భారతీయ జనతా పార్టీని సరైనదని ప్రజలు నమ్ముతున్నారని ఈ విజయం నిరూపించింది. ఈ సందర్భంగా ప్రజలకు మిఠాయిలు పంచి , టపాసులు కాల్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ లెనిన్ , పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్ , మాజీ అధ్యక్షులు ఆడిటర్ రాఘవులు, బండి వెంకటేశ్వర్లు, సుధా గణేష్, జిల్లా కార్యదర్శి గొడవర్తి సుజాత, యువ మోర్చా నాయకులు అంబటి వెంకటరెడ్డి, దేనువకొండ శ్రీహరి రాజు, జాన్ బాబు, గర్రె అనిల్ ,నిడమనూరు అంజయ్య, సీనియర్ నాయకులు అచ్యుత వెంకట మూర్తియ్య గోళ్ల మస్తాన్ రావు , చింతపల్లి గాలెమ్మ, దర్ణాసి కోటయ్య, దేవతి చిన్న నరసింహారావు, దేశ వెంకట లక్ష్మీనారాయణ ,గర్రె రామచంద్రరావు, అప్పల రాజా, కోట సాయి తదితరులు పాల్గొన్నారు. (Story : ఢిల్లీలో బిజెపి గెలుపు..వినుకొండలో సంబరాలు)