సర్పంచ్ అభ్యర్థిని గొంతు కోసి చంపిన మావోయిస్టులు?
న్యూస్‌తెలుగు/చింతూరు: చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దంతివాడ జిల్లా అరన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి యోగ బర్సే(45) ను మావోయిస్టులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు గొంతు కోసి చంపారు. గురువారం అర్ధరాత్రి తన ఇంట్లో నిద్రస్తుండగా గొడ్డలితో తలుపులు పగలగొట్టి కుటుంబ సభ్యుల ఎదుట గొంతు కోసి హత్య చేశారు. గతంలో మృతుడు జోగా సిపిఐ పార్టీలో పనిచేసేవాడు. కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడు. యోగా మృతితో ఆ గ్రామం అంతా విషాదఛాయలు నెలకొన్నాయి. (Story: సర్పంచ్ అభ్యర్థిని గొంతు కోసి చంపిన మావోయిస్టులు?)