ఐదేళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దే బాటలో టీడీపీ
కూటమి అభ్యర్థి ఆలపాటి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జీవీ
న్యూస్ తెలుగు/వినుకొండ: రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలన, జగన్ చేసిన నష్టం, విధ్వంసం చక్కదిద్దేబాటలోనే కూటమి పాలన సాగుతుందని ప్రభుత్వచీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గడిచిన 7 నెలలుగా అదే లక్ష్యంగా ఒక్కొక్క వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడుతూ వ స్తున్నారని తెలిపారు. అవి చేసుకుంటూనే అభివృద్ధి, సంక్షేమంలో ఏపీని దేశంలోనే తిరిగి మొద టి స్థానంలో నిలిపేందుకు చేస్తున్న కృషిలో ప్రజల మద్దతు కూడా ఎంతోకీలకమన్నారు జీవీ. ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంందర్భంగా ఆలపాటికి అభినందనలు తెలిపిన చీఫ్‌విప్ జీవీ రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్న తరుణంలో ఆయన్ను గెలిపించడానికి పట్టభద్రులంతా చాలా సంసిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంటే ఉన్నారని పేర్కొన్నా రు. గతంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గతంలో మంత్రిగా, రైతు నాయకుడిగా, యువత నాయకుడిగా, విద్యార్థి దశ నుంచి కూడా నాయకత్వం బాధ్యతలు తీసుకుని అనేక సమస్యల పరిష్కారంలో ముందున్నారని.. అపార అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా ఎన్డీఏ కూటమిలోని పార్టీలు సమిష్టిగా కృషి చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్, గళ్లా మాధవి, నజీర్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నేతలు పాల్గొన్నారు. (Story: ఐదేళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దే బాటలో టీడీపీ)